ప్రమాదవశాత్తు బురదలో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు బురదలో పడి వ్యక్తి మృతి

WNP: ప్రమాదవశాత్తు చెరువు అంచులో ఉన్న బురదలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వనపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై హరిప్రసాద్ వివరాలు.. రాయిగడ్డకు చెందిన జే.రమేష్ (36) బుధవారం రాత్రి నల్ల చెరువుకు చేపల కావలికి వెళ్లాడు. గురువారం చెరువు అంచున బురదలో పడి ఉండగా తోటి వారు చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు తెలిపారు.