రైతులకు అంతర్ పంటల ద్వారా ఆదాయం: అదనపు కలెక్టర్

రైతులకు అంతర్ పంటల ద్వారా ఆదాయం: అదనపు కలెక్టర్

KMM: ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ పంట శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలను అందిస్తుందని, ఎటువంటి నష్టం సంభవించదని తెలిపారు. రైతులకు అంతర్ పంటల ద్వారా ఆదాయం లభిస్తుందని వివరించారు.