'వారిని డ్యూటీ మినహాయించండి'
ADB: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని, గర్భిణీలను, దివ్యాంగులను మినహాయించాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపికృష్ణ కోరారు. ఈ విషయమై గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. స్క్రావెంజర్ గ్రాంట్ నీ యూ డైస్ ఎన్‌రోల్‌మెంట్ ప్రకారం విడుదల చేయాలని కోరారు.