సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

NLR: బుచ్చి మండలం దామరమడుగు గ్రామ ప్రజలు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.