దేదీప్యమానంగా కాశీ.. ఫొటోలు పంచుకున్న మోదీ

దేదీప్యమానంగా కాశీ.. ఫొటోలు పంచుకున్న మోదీ

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర కాశీ నగరంలో దేవ్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన కాశీలోని గంగానదీ ఘాట్‌లలో ప్రజలు లక్షలాది దీపాలను వెలిగించారు. దీంతో దీపాల వెలుగులతో నగరం దేదీప్యమాన వెలిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మోదీ 'X'లో పంచుకున్నారు.