విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

BHNG: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆలేరు మున్సిపాలిటీ బహద్దుర్ పేటలో గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన నాగమణి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటికి మంటలు అంటుకున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే పోలీస్, ఫైర్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చారు.