పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

MBNR: జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలను ఈరోజు నిర్వహించగా అధ్యక్షుడిగా కృష్ణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్‌గా శేఖర్, జనరల్ సెక్రెటరీగా సుల్తాన్, జాయింట్ సెక్రటరీగా మల్లేష్, ట్రెజరర్‌గా ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సన్మానించారు.