బైక్​ చక్రంలో చిక్కిన చీరకొంగు.. మహిళ మృతి

బైక్​ చక్రంలో చిక్కిన చీరకొంగు.. మహిళ మృతి

BHNG: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బోయ సాయమ్మ బుధవారం తన కుమారుడితో కలిసి చిన్న కొండూరుకు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయమ్మ మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.