నేడు శ్రీకాళహస్తికి మహిళా ప్రజా ప్రతినిధుల రాక

TPT: జాతీయ మహిళా సాధికార కమిటీ సదస్సుకు హాజరైన మహిళ ప్రజా ప్రతినిధులు సోమవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనానికి విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రజా ప్రతినిధుల దర్శన ఏర్పాట్లపై ఈవోను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు ఎమ్మెల్యే తగిన సూచనలు చేశారు.