ఈసీ వాగు ఉద్ధృతికి ఎర్రవల్లిలో వరి పంటకు భారీ నష్టం

RR: ఈసీ వాగు ఉద్ధృతికి షాబాద్ ఎర్రవల్లిలో వరి మొక్కజొన్న పత్తి, ఇతర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. సుమారుగా 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని వరి చేనులో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఎర్రవల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.