అమానుషం.. మహిళపై గొడ్డలి దాడి
E.G: జి కొత్తపల్లి గ్రామంలో కామరాజుపేటకు చెందిన లావణ్య అనే మహిళపై దుర్గాప్రసాద్ గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన లావణ్యకు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, రాజమహేంద్రవరం తరలించారు. డ్వాక్రా గ్రూపులో జరిగిన అవకతవకలపై లావణ్య కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినందుకు యానిమేటర్ దుర్గాదేవి భర్త దాడికి పాల్పడ్డాడని లావణ్య భర్త ఆరోపించారు.