భీమన్నను దర్శించుకున్న టీఎన్జీవో అధ్యక్షుడు
SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి వారిని KNR టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంఛార్జ్ ఈఓ అంజనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జీవోను సన్మానించి టీఎన్జీవో డైరీని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.