రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KMM: మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ బస్సు ఖమ్మం వెళ్తుండగా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.