ఆసియా దేశాలకు తగ్గిన అరామ్‌కో చమురు సరఫరా

ఆసియా దేశాలకు తగ్గిన అరామ్‌కో చమురు సరఫరా

అరామ్‌కో నుంచి చమురు సరఫరా ఆసియా దేశాలకు తగ్గింది. హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలతో ఈ పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌ కాంట్రాక్టులకు మాత్రం ఎర్ర సముద్రంలోని యాంబు పోర్టు నుంచి చమురును సరఫరా చేయనుంది. మార్చిలో రోజుకు 4.355 మిలియన్‌ బ్యారెళ్ల ఎగుమతి కాగా అదే ఫిబ్రవరిలో 7.108 మిలియన్‌ బ్యారెళ్ల సరఫరా జరిగింది.