'రైతులు అప్రమత్తంగా ఉండాలి'
కృష్ణా: దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా రైతాంగం అప్రమత్తంగా ఉండి తమ వరి, మినుము పంటలను రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు వరి కోతలను కోయడం వినిపివేయాలని సూచించారు. సామాన్య స్థితికి వచ్చినపుడు మరలా ప్రారంభించాలని తెలిపారు.