స్వయం ఉపాధి ఋణాలకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద జిల్లాలోని దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కోసం 100% రాయితీతో రూ.50 వేల చొప్పున 27 యూనిట్లు, 80% రాయితీతో రూ. లక్ష ఒక యూనిట్, 60% రాయితీతో రూ.3 లక్షలు ఒక యూనిట్ మంజూరు చేశారు. tgobmms.cgg.gov.in వెబ్ సైట్‌లో ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారిణి స్వర్ణలత తెలిపారు.