నేడు సారపాకలో విద్యుత్ అంతరాయం

BDK: సారపాక పరిధిలో ఇవాళ చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఉపేందర్ తెలిపారు. సారపాక లీడర్ 2 పరిధి మసీదు రోడ్డు, పాత సారపాక, సారపాక సెంటర్, బూర్గంపాడు రోడ్డు, భద్రాచలం రోడ్డు, గణేష్ టెంపుల్ ఏరియా, వరుణ్ మోటార్స్ ఏరియాలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.