'ప్రజల రక్షణకు జిల్లాలో 'విజిబుల్ పోలీసింగ్'

'ప్రజల రక్షణకు జిల్లాలో 'విజిబుల్ పోలీసింగ్'

కడప: నేరాలను నియంత్రించడం, శాంతిభద్రతలను కాపాడటం లక్ష్యంగా పోలీసులు ఆదివారం కడప నగరంలో విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయడంతో పాటు, గంజాయి రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రంకెన్ డ్రైవింగ్, ఆటోలలో ఓవర్‌లోడింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.