'సభను నడవనిస్తారో.. రచ్చ చేస్తారో?'
పార్లమెంట్ సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కోరారు. గొడవ చేయకుండా ఉంటేనే ఎక్కువ బిల్లులు పాస్ అవుతాయని, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని హితవు పలికారు. ఈసారైనా సభను నడవనిస్తారో లేక రచ్చ చేస్తారో చూడాలన్నారు. కాలుష్యంపై కచ్చితంగా చర్చ జరగాల్సిందేనని, అయితే సభను స్తంభింపజేయకుండా చర్చలో పాల్గొనాలని కంగనా విజ్ఞప్తి చేశారు.