రన్నింగ్‌లోనే ఊడిన టైరు.. బైక్‌కు ఢీ

రన్నింగ్‌లోనే ఊడిన టైరు.. బైక్‌కు ఢీ

MHBD: రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రం ఊడి రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటన మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. వరంగల్ డిపోకు చెందిన బస్సు ఉదయం వరంగల్ నుంచి ఖమ్మం సర్వీస్కు వెళ్తుండగా లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపంలో బస్సు రన్నింగ్‌లో ఉండగానే వెనుక చక్రం ఊడి పక్కనుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.