రంగసాగర్ సర్పంచిగా బొడ్ల సాగర్
JGL: బీర్పూర్ మండలంలోని రంగసాగర్ సర్పంచ్ గా ఇండిపెండెంట్ బోడ సాగర్ తన సమీప అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో గ్రామంలో సాగర్ అభిమానులు, గ్రామ నాయకులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని, సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు.