VIDEO: తల్లిని హత్య చేసిన కొడుకు

VIDEO: తల్లిని హత్య చేసిన కొడుకు

AKP: నాతవరం మండలం వైబీ పట్నం గ్రామంలో తల్లిని కొడుకు హత్య చేశాడు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. చిటికెల రామ్మూర్తి నాయుడు తన తల్లి మంగ (58)ను దారుణంగా హత్య చేశాడు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.