భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన

తిరుపతి: ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎలీ కంపెనీ కోసం ఏపీఐఐసీ నిర్వహిస్తున్న భూసేకరణ సర్వేను సత్యవేడు నియోజకవర్గం కొల్లడం గ్రామస్తులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన రహదారిలో బైఠాయించి పెట్రోల్ బాటిళ్లతో సర్వేయర్ల ఎదుట నిరసన తెలిపారు. తమ భూములను కాపాడుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.