'మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించండి'

VZM: ఆగస్టు 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత సూచించారు. స్థానిక కోర్టు సమావేశ మందిరంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మోటారు ప్రమాద భీమా కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.