VIDEO: రేపు నిశ్చితార్థం.. ఇంతలో ఘోర ప్రమాదం
KMM: రేపు నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గత రాత్రి మద్దులపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న ప్రసాద్ (28)ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడు రోడ్డుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.