ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.