లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

కృష్ణా: గుడివాడ బస్టాండ్ సమీపంలోని కోతి బొమ్మ సెంటర్ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. లారీ అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.