గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మెదక్: జిల్లాలోని నర్సాపూర్ లో నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో గుర్తు లేని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సాపూర్ మండలం నారాయణపురం కు చెందిన నక్క శ్రీశైలం ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు నర్సాపూర్ నుండి గుమ్మడిదల వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసలు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.