బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సహాయం
TPT: రేణిగుంట మండలం కరకంబడికి చెందిన దేవళ్ల సతీష్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి CMRF నుంచి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా పంపిణీ చేశారు. సతీష్ త్వరగా కోలుకోవాలని, కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.