20 హామీలతో ఇటిక్యాల సర్పంచ్

20 హామీలతో ఇటిక్యాల సర్పంచ్

GDWL: ఇటిక్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకేపోగు రాంబాబు సోమవారం గ్రామంలో ప్రచారం నిర్వహించి 20 కీలక హామీలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన, ప్రధాన రహదారికి ఆనుకుని అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి 3,016 రూపాయల ప్రోత్సాహకం వంటి అంశాలను ఆయన ప్రజల ముందుంచినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ హామీలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.