టీడీపీ ఆవిర్భావ వేడుకలల్లో ఎమ్మెల్యే
BPT: పిట్టలవానిపాలెం మండలంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హాజరయ్యారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.