పెన్నహోబిలంలో వివిధ హక్కులకు 22న వేలం
ATP: ఉరవకొండ పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కలగలపు బియ్యం విక్రయించు హక్కుకు ఈ నెల 22న ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నట్లు ఈవో సాకే రమేష్ బాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పోగైన తలనీలాల సేకరణ హక్కుకు పాట దారులు అందజేసిన షీల్డ్ టెండర్‌లను ఓపెన్ చేస్తామన్నారు.