రేపు మార్కాపురంలో పూలే జయంతి: కలెక్టర్

రేపు మార్కాపురంలో పూలే జయంతి: కలెక్టర్

మార్కాపురం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు మార్కాపురం తర్లుపాడు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద పూలే జయంతి వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టరేట్లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు.