మానవహారం చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

మానవహారం చేపట్టిన ఆర్టీసీ కార్మికులు

KMR: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. నర్సంపేటలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.