ఆమనగల్లు SHOగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ
RR: ఆమనగల్లు PSకు నూతన SHOగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.