రోడ్డుపై నాటు వేసి.. వినూత్న నిరసన

రోడ్డుపై నాటు వేసి..  వినూత్న నిరసన

NLG: నల్గొండ జిల్లాలో గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైన భీమారం సూర్యాపేట రోడ్డు పనులను ఇంతవరకు పూర్తి చేయలేదని మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని ఆరోపించారు. బుధవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రోడ్లపై నాటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాన పడితే రోడ్లు చెరువును తలపిస్తుందని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరారు.