VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
MDK: వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ వరి ధాన్యం కొలుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు రోజుల క్రితం ఐకెపీ సిబ్బందిపై ఓ రైతు దాడి చేశారు. దీంతో కొనుగోలు నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. ఐకెపీ సిబ్బందితో మాట్లాడి కేంద్రం ప్రారంభించారు.