మోగల్లులో ఉచిత పశు వైద్య శిబిరం
W.G: పాలకోడేరు మండలం మోగల్లులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 50 మంది రైతులు పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, నట్టల నివారణ మందులు, పీడ, రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో మండల పశువైద్యాధికారిణి హేమ పాల్గొన్నారు.