కమిషనర్‌ను అభినందించిన సీఎం

కమిషనర్‌ను అభినందించిన సీఎం

EG: కేంద్ర ప్రభుత్వం నుంచి 'జల్ సంచాయ్-జన్ భాగీధారి' అవార్డును అందుకున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకు వచ్చిన ఆయన అవార్డును చూసి కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేస్తే ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయని ఆయన అన్నారు.