ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు: కలెక్టర్

WNP: రైతులు ఆయిల్ పామ్ సాగు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆ వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉందని అన్నారు.