ఘోర రైలు ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర రైలు ప్రమాదం.. 11 మంది మృతి

చైనా యునాన్ ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది రైల్వే నిర్మాణ కార్మికులు మృతి చెందారు. లుయోయాంగ్ టౌన్ స్టేషన్ వద్ద ట్రాక్‌పై పని చేస్తున్న కార్మికులను  రైలు ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స పొందుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోంది.