పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

MNCL: జన్నారం శివారులోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నడంతో సమీప కాలనీ ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించామని పోన్కల్ ఈవో రాహుల్ తెలిపారు. జన్నారంలో మూడు గంటలుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద రావడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు సమీపంలోని బుడగ జంగాల కాలనీలో ఉన్న 10 కుటుంబాలను సమీప పీఆర్టీయూ భవన్‌కు తరలించారు.