అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
SRD: సదాశివపేట మండలంలోని ముబారక్ పూర్ గ్రామాన్ని సంగారెడ్డి MLA చింత ప్రభాకర్ నేడు సందర్శించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు.