దేవరపల్లిలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీపీ

E.G: దేవరపల్లి ఎంపీపీ కేవీకే.దుర్గారావు శనివారం ఉదయం దేవరపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంపీపీ నిధుల నుంచి దేవరపల్లిలో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి రూ.7 లక్షలతో ఈ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. అలాగే, మండల అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందించామన్నారు.