ప్రశాంతంగా సాగిన అక్రమ ఇళ్ల కూల్చివేత
MNCL: బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామంలో అక్రమ ఇళ్ల కూల్చివేత కార్యక్రమం శుక్రవారం ప్రశాంతంగా సాగింది. ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.