ఈనెల 25 నుంచి CITU రాష్ట్ర మహాసభలు: వెంకటమ్మ
ADB: ఈనెల 25, 26వ తేదీల్లో జిల్లా కేంద్రంలో CITU రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అంగన్వాడీ జిల్లాధ్యక్షురాలు వెంకటమ్మ తెలిపారు. బుధవారం భీంపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.