ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 'ఫోన్‌మిత్ర' పథకం అమలు

MBNR: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఫోన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 బాలుర, బాలికల సాంఘిక గురుకుల పాఠశాలలో చదివే 19400 విద్యార్థులు వారి సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకుని మనోధైర్యం పొందేందుకు ఈ సంవత్సరం నుంచే ‘ఫోన్‌మిత్ర’ పథకాన్ని ప్రారంభించారు.