రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని వినతి
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లితాండ గ్రామాలు ముంపుకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని కోరుతూ భూ నిర్వాసితులు బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుడు సర్వేల వల్ల గ్రామాలు అన్యాయంగా ముంపు జాబితాలో చేరాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.