VIDEO: వైభవంగా గోదా -రంగనాథుల కల్యాణం

VIDEO: వైభవంగా గోదా -రంగనాథుల కల్యాణం

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి-రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో గోదాదేవి-రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, కళ్యాణ వేడుకలను ఆలయ పూజారులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తులు పాల్గొన్నారు.