ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

SKLM: వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది చైతన్య అనే యువకుడు పూండి నుంచి పలాస వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండవూరుకు చెందిన కొరికాన చైతన్య ( 30 ) స్పాట్‌లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.